Devara Musical Nights : ‘దేవర’ మ్యూజికల్ ఈవెంట్స్.. ఆ నాలుగు సిటీల్లో..

దేవర మ్యూజికల్ నైట్స్ అనే పేరుతో నాలుగు సిటీల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

NTR Devara Movie

Devara Musical Nights : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ తో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ముంబై, చెన్నైలో మాత్రమే ప్రెస్ మీట్స్ పెట్టారు. తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇంకా పెట్టలేదు. అసలు తెలుగులో ప్రెస్ మీట్ ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు. దేవర తెలుగు ప్రమోషన్స్ లో కేవలం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉంటుందని సమాచారం.

Also Read : Ram Charan – Rhyme : ఫ్యాన్స్‌ని మోసం చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల ‘రైమ్’.. అది నేను కాదు నా తమ్ముడు..

దీంతో తెలుగులో దేవర ప్రమోషన్స్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేవర మ్యూజికల్ నైట్స్ అనే పేరుతో నాలుగు సిటీల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దేవర మ్యూజికల్ నైట్స్ ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ సిటీలలో నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

అయితే ఈ ఈవెంట్స్ కి కేవలం దేవర పాటలు పాడిన సింగర్స్ మాత్రమే వస్తారని, దేవర మూవీ యూనిట్ రాదని తెలుస్తుంది. మ్యూజికల్ నైట్స్ పేరుతో ఓన్లీ సినిమాలోని పాటల కోసం ఓ ఈవెంట్ చేయబోతున్నారు. మరి ఈ ఈవెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.