Ram Charan – Rhyme : ఫ్యాన్స్‌ని మోసం చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల ‘రైమ్’.. అది నేను కాదు నా తమ్ముడు..

సోషల్ మీడియాలో రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల రైమ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.

Ram Charan – Rhyme : ఫ్యాన్స్‌ని మోసం చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల ‘రైమ్’.. అది నేను కాదు నా తమ్ముడు..

Ram Charan Pet Dog Rhyme Social Media Account Shares Interesting Post it goes Viral

Updated On : September 19, 2024 / 7:05 AM IST

Ram Charan – Rhyme : రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల ‘రైమ్’ గురించి అందరికి తెలిసిందే. చరణ్ ఎక్కడికి వెళ్లినా రైమ్ ని వెంటపెట్టుకొని తీసుకెళ్తాడు. రైమ్ కూడా చరణ్ ని వదిలి అస్సలు ఉండదు. ఎప్పుడూ రైమ్ చరణ్ వెంటే ఉండటం, రైమ్ కి సోషల్ మీడియా అకౌంట్ పెట్టి దాని క్యూట్ ఫోటోలు షేర్ చేయడంతో ఈ కుక్క పిల్లకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

సోషల్ మీడియాలో రైమ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తన అకౌంట్ లో రైమ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తే అవి వైరల్ అవ్వాల్సిందే. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం చరణ్ మనుషులు ఒక కుక్కపిల్లని వాకింగ్ కి బయటకు తీసుకొచ్చారు. బయట ఉన్న చరణ్ ఫ్యాన్స్ అది రైమ్ అనుకోని దాంతో ఎగబడి మరీ ఫోటోలు దిగారు. ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే రైమ్ సోషల్ మీడియాలో దీనికి కౌంటర్ గా ఓ పోస్ట్ షేర్ చేసారు.

Also Read : Game Changer – Thaman : గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేసాడుగా..

తాజాగా రైమ్ అకౌంట్ లో ఫ్యాన్స్ కుక్క పిల్లతో ఫోటోలు దిగుతున్న వీడియో షేర్ చేసి.. వాడు మా తమ్ముడు టాఫీ బాబు. నేను నాన్నతో RC16 వర్క్స్ లో ఉన్నాను. టాఫీ ఎంజాయ్ చెయ్యి. మా బ్రదర్ ని జాగ్రత్తగా డీల్ చేయండి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా భలే మోసం చేసావే రైమ్ గా, ఫ్యాన్స్ ని మోసం చేసిన రైమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకుంటున్నారు నెటిజన్లు. మొత్తానికి మరోసారి రైమ్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Rhyme Konidela (@alwaysrhyme)