Game Changer – Thaman : గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేసాడుగా..

తమన్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ లీక్ చేసాడు.

Game Changer – Thaman : గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేసాడుగా..

Music Director Thaman Leaks Ram Charan Game Changer Movie Updates

Updated On : September 19, 2024 / 6:46 AM IST

Game Changer – Thaman : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు ఉన్నా ఎలాంటి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికి ఒక్క సాంగ్, రెండు పోస్టర్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేవు. క్రిస్మస్ కి సినిమా రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెప్పినా డేట్ చెప్పకపోవడం, సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలే ఉన్నా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం కూడా ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తుంది.

ఈ నేపథ్యంలో తమన్ వరుసగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇచ్చారు. ఇటీవల అన్ని సినిమాల గురించి అప్డేట్స్ లీక్ చేసే పని పెట్టుకున్న తమన్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ లీక్ చేసాడు.

Also Read : MAD 2 : ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా సీక్వెల్ వచ్చేస్తుంది.. ‘మ్యాడ్ స్క్వేర్’ తో పిచ్చెక్కించడానికి రెడీ..

తన ట్విట్టర్లో తమన్.. గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి నెక్స్ట్ అప్డేట్ రానుంది. అదిరిపోతుంది అని ట్వీట్స్ చేసాడు. దీంతో గేమ్ ఛేంజర్ పై తమన్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారగా పోనిలే మీరన్నా అప్డేట్స్ ఇచ్చారు అని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.