NTR Speech : ఆ రోజు మా అమ్మానాన్న లేరు.. చేతికి సర్జరీ.. బాధ పడ్డాను.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..
కార్తికేయతో ఉన్న అనుబంధంతో ఎన్టీఆర్ నేడు ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు.(NTR Speech)
- Saketh U
- Updated on- September 29, 2026 / 10:06 PM IST
NTR Speech
NTR Speech : ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమా నిర్మించడంతో కార్తికేయతో ఉన్న అనుబంధంతో ఎన్టీఆర్ నేడు ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. రాజమౌళి కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చేతికి సర్జరీ అయిన తర్వాత నుంచి జోష్ రావట్లేదు. ఇవాళ మీ అందర్నీ చూశాక జోష్ వచ్చింది. చెయ్యి బాగానే కోలుకుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతున్నాం. చెప్పిన డేట్ కే వస్తుంది డ్రాగన్. కార్తికేయ కోసం వచ్చాను నేడు. కరోనా సమయంలో ఓటీటీ ద్వారా మన తెలుగు వారి ఇళ్లల్లోకి వచ్చాడు ఫహద్. బెంగుళూరు డేస్ చూసిన దగ్గర్నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను. నాకు చాలా మంది తక్కువ నటులు ఇష్టం. అందులో ఫహద్ ఒకరు. యాక్టింగ్ కోసం ఆయన సినిమాలు చూస్తాను. నా బ్రదర్ లాంటి వాడు. ఇండియా గర్వించదగ్గ నటుల్లో ఫహద్ ఒకరు. ఈ సినిమా డైరెక్టర్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఎప్పట్నుంచో డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు ఇవ్వాళ అయ్యాడు. నా తమ్ముడు హిట్ కొట్టాలి.
2000 నంవంబర్ లో నిన్ను చూడాలని నా మొదటి సినిమా ఓపెనింగ్ జరిగింది. మొదటి రోజు ఓపెనింగ్ కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి. అమ్మ ఎప్పుడూ బయటకు రాదు నాతో అమ్మ రాలేదు ఆ రోజు. నాన్న నా కాళ్ళ మీద నేను నిలబడాలని రాలేదు. ఆ రోజు అమ్మ నాన్న రాకపోవడంతో నేను ఒక్కడినే వెళ్ళాను. నా ఫ్యామిలీ ఎవరూ లేరు ధైర్యం చెప్పడానికి. ఆ రోజు బాధ కలిగింది. నా బాధని దేవుడు విన్నాడేమో అందుకే మీ అందరి ప్రేమని నాకు ఇచ్చాడు. మీరు నా శక్తి అయితే దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం రాజమౌళి, కీరవాణి కుటుంబం.
స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయిన తర్వాత మొదటి, రెండు, పది ఏళ్ళు ఎప్పుడూ జరుపుకోలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్ళు అయింది. ఇవాళ రాజమౌళి, నా కుటుంబంతో జరుపుకున్నాను. రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలతో కార్తికేయని కూడా ఇచ్చాడు దేవుడు. స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు నాకు 17 ఏళ్ళు. నాకంటే కార్తికేయ 8 ఏళ్ళు చిన్న కార్తికేయ. అప్పుడు వాడికి 9 ఏళ్ళు. ఇవాళ ఇక్కడ నిర్మాతగా ఉన్నాడు. మా అమ్మని అడిగేవాడ్ని ఇంకొకరిని ఎందుకు కనలేదు, తమ్ముడు ఉంటే బాగుండేది అనుకునేవాడిని. అలా ఆ దేవుడు ఇచ్చిన తమ్ముడు కార్తికేయ. నాకు సినిమాలు ఫెయిల్ అయినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు కార్తికేయ నిలబడ్డాడు నా పక్కన. RRR సినిమా అయిందంటే కార్తికేయ వల్ల. బాహుబలి వెనక కూడా కార్తికేయ నిలబడ్డాడు. జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో, నా మొహం మీద నవ్వు వచ్చినపుడు, నేను ఏడ్చినప్పుడు నాకు చెయ్యి అందించింది వీడే. నన్ను ఇవాళ ఎమోషనల్ చేసాడు. నా కార్తికేయ మొదటిసారి నిర్మాత అయ్యాడు. మీ అందరి ప్రేమ అతనికి ఇవ్వాలి. నా లాగే నా తమ్ముడ్ని ఆశీర్వదించాలి. త్వరలో మళ్ళీ డ్రాగన్ తో వస్తాను అంటూ ఎమోషనల్ అయ్యారు.
