War 2 : వార్ 2 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లు..? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..

తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వైరల్ గా మారింది.

War 2

War 2 : హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2. ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు ఇక్కడ తెలుగులో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా చేయకపోయినా హైప్ అయితే ఉంది. తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వైరల్ గా మారింది.

వార్ 2 సినిమా తెలుగు రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ కొనుక్కున్న సంగతి తెలిసిందే. అందుకే నాగవంశీ ఇక్కడ వార్ 2 కి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాగవంశీ వార్ 2 తెలుగు రైట్స్ ని దాదాపు 90 కోట్లకు కొన్నాడని సమాచారం.

Also : Coolie – War 2 : రెండు సినిమాల అడ్వాన్స్ సేల్స్ ఎన్ని కోట్లు తెలుసా? కూలీకి దరిదాపుల్లో కూడా లేని వార్ 2..

నైజాం 36.50 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఆంద్ర 36 కోట్లకు వార్ 2 థియేటరికల్ రైట్స్ కొన్నారని తెలుస్తుంది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమాకు 90.50 కోట్ల బిజినెస్ జరిగింది. కేవలం ఎన్టీఆర్ వల్లే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 95 కోట్ల షేర్ రాబట్టాలి అంటే కనీసం 190 కోట్ల గ్రాస్ రావాలి. మూడు రోజులు సెలవులు, ఎన్టీఆర్ ఉండటం, ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంది కాబట్టి ఈజీగానే తెలుగులో కలెక్ట్ అవుతాయని తెలుస్తుంది.

ఇక హిందీలో ఇది YRF సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావడం, వార్ సీక్వెల్ కావడం, హృతిక్ రోషన్ ఉండటం, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఈ సినిమాకి 150 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 23 కోట్లు, ఓవర్సీస్ 102 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమాకు ఏకంగా 365.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Also Read : Movie Ticket Prices : వార్ 2, కూలీ మూవీ టికెట్ రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ కనీసం 370 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే దాదాపు 740 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. మరి వార్ 2 ప్రపంచవ్యాప్తంగా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మొదటి రోజు 100 కోట్లకు పైగా టార్గెట్ పెట్టుకొని, ఓవరాల్ గా 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది వార్ 2 సినిమా.