NTR : ఆంజనేయస్వామి దీక్షలో ఎన్టీఆర్..

తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఆంజనేయస్వామి మాల వేశారు. ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి మాలలో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో........

Ntr

 

NTR :  స్టార్ హీరోలు, సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు తమ పూజలు, భక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. మన స్టార్ హీరోలు కూడా బాగా భక్తి ఉన్నవారే. సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా దీక్షలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా మన స్టార్స్ అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ స్టార్లు చాలా మంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగణ్…. ఇలా చాలా మంది ప్రముఖులు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. కొంతమంది శివ మాల, వేంకటేశ్వరస్వామి మాల, ఆంజనేయస్వామి మాల కూడా వేసుకుంటారు.

వారు ఆ మాలలో ఉన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఇటీవలే చరణ్, తారక్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చరణ్ రెగ్యులర్ గా మీడియాలో కనపడుతున్నాడు. ఆల్రెడీ తన నెక్స్ట్ సినిమా షూట్ కూడా మొదలుపెట్టేశాడు చరణ్. ఇప్పుడు కూడా చరణ్ మాలలోనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత సక్సెస్ పార్టీలో తప్ప బయట ఎక్కడా ఎన్టీఆర్ కనపడలేదు. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

Acharya : నీ బాబునిరా నేను.. అక్కడ చూసుకుందాం.. చెర్రీకి ‘చిరు’ వార్నింగ్

ఎన్టీఆర్ తాజాగా ఆంజనేయస్వామి మాల వేశారు. ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి మాలలో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎన్టీఆర్ ఎప్పుడూ మాల వేసుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఎన్టీఆర్ మాల వేసుకోవడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మాలలో ఎన్టీఆర్ ఎన్ని రోజులు ఉండనున్నారో, తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.