NTR Is Not Acting In This Crazy Project
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని.. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
JR NTR: ఎప్పటికైనా జూ.ఎన్టీఆరే టీడీపీ లీడర్- చెన్నకేశవ రెడ్డి
కాగా, ఈ సినిమా తరువాత తారక్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఓ క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో తారక్ ఓ కేమియోలో రోల్‌లో కనిపిస్తాడని.. ఆయన పాత్ర సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తారక్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తాడనే వార్తలు వచ్చాయి.
NTR: వార్ కోసం డేట్స్ ఫిక్స్ చేసుకున్న తారక్.. నిజమేనా?
కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తారక్ ఈ ప్రెస్టీజియస్ మూవీలో నటించడం లేదని తాజాగా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాను రాజమౌళి పక్కా అడవి నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మరో హీరో నటించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ క్రేజీ కాంబోలో రాబోయే సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.