The Great Indian Kapil Show : బాలీవుడ్ గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్.. దేవర టీంతో ఫుల్ కామెడీ.. ప్రోమో చూశారా..?

తాజాగా బాలీవుడ్ టాప్ షోలలో ఒకటి అయిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కలిసి వచ్చి సందడి చేసారు.

NTR Janhvi Kapoor Saif Ali Khan on The Great Indian Kapil Show for Devara Promotions

The Gre at Indian Kapil Show : ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ముంబైకి వెళ్లి దేవర ట్రైలర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో పాటు బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఎన్టీఆర్. దేవర టీంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ బాలీవుడ్ కావడంతో వాళ్ళు కూడా బాలీవుడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

Also Read : Devara – Hollywood : ‘దేవర’ షార్క్ సీన్‌కి హాలీవుడ్ ఆడియన్స్ రియాక్షన్స్ చూసారా.. బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్..

తాజాగా బాలీవుడ్ టాప్ షోలలో ఒకటి అయిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కలిసి వచ్చి సందడి చేసారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. దేవర సినిమా గురించి, శ్రీదేవి గురించి, నార్త్ సౌత్ గురించి మాట్లాడుకున్నారు షోలో. ఎన్టీఆర్ కూడా బాగానే పంచులు వేశారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..

ఇక ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ హాజరయిన ఈ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఫుల్ ఎపిసోడ్ శనివారం సెప్టెంబర్ 28న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫుల్ గా కామెడీ చేసిన ఈ షో ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.