Devara – Hollywood : ‘దేవర’ షార్క్ సీన్‌కి హాలీవుడ్ ఆడియన్స్ రియాక్షన్స్ చూసారా.. బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్..
దేవర ట్రైలర్ కి హాలీవుడ్ ఆడియన్స్ బాగా ఆశ్చర్యపోయారని తెలుస్తుంది.

Hollywood Stunning Reactions for NTR Devara Trailer in Beyond Fest Video goes Viral
Devara – Hollywood : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అక్కడ స్టేజిపై ఎన్టీఆర్ మాట్లాడి హాలీవుడ్ ఆడియన్స్ కి తన కోసం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో దేవర ట్రైలర్, టీజర్ బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించారు. దేవర ట్రైలర్ కు అక్కడ హాలీవుడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా దేవర ట్రైలర్ లోని షార్క్ సీన్ చూసి హాలీవుడ్ ఆడియన్స్ స్టన్ అయ్యారు. ట్రైలర్ అయ్యాక అందరూ లేచి నిల్చొని చప్పట్లతో మారుమోగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
NTR at #BeyondFest Los Angeles !
Taking Telugu- Indian Cinema to New Heights ! @tarak9999 #Devara pic.twitter.com/w2VBqQcBPR
— Suresh PRO (@SureshPRO_) September 25, 2024
దేవర ట్రైలర్ కి హాలీవుడ్ ఆడియన్స్ బాగా ఆశ్చర్యపోయారని తెలుస్తుంది. ఇక సినిమా చూస్తే ఏమైపోతారో హాలీవుడ్ ఆడియన్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నేడు సాయంత్రం బియాండ్ ఫెస్ట్ లో దేవర సినిమా ప్రీమియర్ వేయనున్నారు. ఎన్టీఆర్ కూడా బియాండ్ ఫెస్ట్ లో హాలీవుడ్ ఆడియన్స్ తో కూర్చొని దేవర సినిమా చూడబోతున్నారు.