Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హోటల్ ధ్వంసం.. ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్ల ఏకంగా అన్ని లక్షల నష్టం..

'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఆ హోటల్ కి భారీగా నష్టం వాటిల్లింది.

Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హోటల్ ధ్వంసం.. ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్ల ఏకంగా అన్ని లక్షల నష్టం..

Due to Devara Pre Release Event Hotel Damage Estimation Cost is Very Huge

Updated On : September 25, 2024 / 7:48 AM IST

Devara Pre Release Event : ఇటీవల ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న జరగాల్సి ఉంది. కానీ ఇచ్చిన పాసుల కంటే పాసులు లేని వాళ్ళు వేలాదిగా ఫ్యాన్స్ హోటల్ దగ్గరకు రావడం, బారికేడ్లు తోసి మరీ లోపలికి వెళ్లడం, నోవాటెల్ హోటల్ అద్దాలు పగలగొట్టడం, కుర్చీలు విరగ్గొట్టడం చేసారు. ఇలా నానా రభస చేసి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసారు ఫ్యాన్స్. పోలీసులతో, హోటల్ సిబ్బందితో గొడవ పడి రచ్చ చేసారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఈవెంట్ క్యాన్సిల్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఆ హోటల్ కి భారీగా నష్టం వాటిల్లింది.

తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం హోటల్ లో జరిగిన డ్యామేజ్.. మెయిన్ ఎంట్రన్స్ గ్లాస్ పగలగొట్టడం, ఎలివేటర్ గ్లాస్ పగలగొట్టడం, కొన్ని డోర్లు విరగ్గొట్టడం, ఖరీదైన కుర్చీలను విరగ్గొట్టడం, అనేక కర్టెన్స్ నాశనం చేయడం చేసారు. వీటన్నిటికీ దాదాపు అక్షరాలా 33 లక్షల డ్యామేజీ అయిందని సమాచారం. ఒక్క కుర్చీలకే 7 లక్షల డ్యామేజీ జరిగిందని తెలుస్తుంది. ఫ్యాన్స్ కొంతమంది కావాలని కుర్చీలు విరగ్గొట్టిన వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లుని తయారుచేసి హోటల్ వాళ్ళు పంపించాల్సిన వాళ్ళకి పంపించారట.

Also Read : Nagababu – Pawan Kalyan : కళ్యాణ్ బాబు చాలా కాలం కింద నాకు ఒక మాట చెప్పాడు.. నాగబాబు ఆసక్తికర పోస్ట్..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన డ్యామేజీకి ఇప్పుడు ఈ బిల్లు ఎవరు కడతారో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతలు కడతారా? ఈవెంట్ నిర్వహణ సంస్థ కడుతుందో చూడాలి. మొత్తానికి ఫ్యాన్స్ చేసిన రచ్చకి ఎవరో బలవుతున్నారు.