Nagababu – Pawan Kalyan : కళ్యాణ్ బాబు చాలా కాలం కింద నాకు ఒక మాట చెప్పాడు.. నాగబాబు ఆసక్తికర పోస్ట్..
పవన్ కు సపోర్ట్ గా తాజాగా నాగబాబు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు.

Nagababu Interesting Post on Pawan Kalyan Comments once said to him
Nagababu – Pawan Kalyan : ప్రస్తుతం లడ్డు వివాదంలో పవన్ రోజూ మాట్లాడుతూ నేషనల్ వైడ్ ఈ ఇష్యూని తీసుకెళ్లారు. సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను, సెక్యులరిజం అంటే అన్ని వైపులా, అందరితో ఉండాలి, సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు. పవన్ అన్న నాగబాబు పవన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తారని తెలిసిందే.
ఈ లడ్డు వివాదంలో పవన్ కు సపోర్ట్ గా తాజాగా నాగబాబు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. ధర్మం గురించి ఉన్న ఓ మాటని చెప్తూ పవన్ నాకు ఓ మాట చెప్పాడు అంటూ పోస్ట్ చేసారు నాగబాబు.
Also Read : Sudheer Babu : సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా పోస్టర్ అదిరిందిగా.. ‘జటాధర’ అంటూ..
నాగబాబు తన పోస్ట్ లో.. హిందూ ధర్మాన్ని అమితంగా నమ్మే కళ్యాణ్ బాబు నాతో చాలా కాలం క్రితం చెప్పిన మాట: సత్య (కృత) యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. అదే త్రేతాయుగంలో మూడు పాదాలతో ధర్మం ఒక భాగంలో అధర్మం నడిచేది. అలాగే ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద, అధర్మం రెండు పాదాల మీద నడిచేది. కలియుగం వచ్చేసరికి అధర్మం మూడు పాదాల మీద ధర్మం కేవలం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. అందుకే ధర్మం ఒక పాదం మీద నడిచినా బలంగా నడవడానికి నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను అన్నాడు కళ్యాణ్ బాబు. నా లీడర్ ధర్మం కోసం నిలబడతాడు అనడానికి ఉదాహరణ ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేసాడు అంటూ తెలిపారు. దీంతో నాగబాబు పోస్ట్ వైరల్ గా మారింది.