Sudheer Babu : సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా పోస్టర్ అదిరిందిగా.. ‘జటాధర’ అంటూ..

సుధీర్ బాబు అదిరిపోయే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు.

Sudheer Babu : సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా పోస్టర్ అదిరిందిగా.. ‘జటాధర’ అంటూ..

Sudheer Babu Pan India Movie Jatadhara Unveiling Second Look

Updated On : September 24, 2024 / 8:52 PM IST

Sudheer Babu : సుధీర్ బాబు ప్రతిసారి కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ఇటీవలే హరోం హర సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించడమే కాక నవ దళపతిగా టాలీవుడ్ కి సరికొత్తగా పరిచయం అయ్యాడు. త్వరలో మా నాన్న సూపర్ హీరో సినిమాతో రాబోతున్న సుధీర్ బాబు ఆ తర్వాత అదిరిపోయే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు.

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ప్రేర‌ణ అరోరా నిర్మాణంలో సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ‘జటాధర’ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా నుంచి అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసారు. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల క‌ల‌యిక‌గా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రాబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఈ పోస్టర్ లో.. సుధీర్ బాబు బైక్ పై వెళ్తుండగా వెనక అమ్మవారి ఉగ్ర రూపం ఉన్నట్టు ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ జటాధర సినిమాను 2025 శివ‌రాత్రికి విడుదల చేయనున్నారు.

Image

ఈ పోస్టర్ లాంచ్ సందర్భంగా నవ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు మాట్లాడుతూ.. జటాధర పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోకి అడుగు పెట్టాక ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని నాకు ప‌రిచ‌యం చేసింది. ఈ సినిమా నాకు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభ‌వం. శాస్త్రీయ‌త‌, పౌరాణిక అంశాల కలయికతో స్క్రిప్ట్‌ రాశారు. రెండు జోన‌ర్స్‌కు చెందిన ప్ర‌పంచాల‌ను స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఓ కొత్త అనుభూతి పొందుతారు. ప్రేర‌ణ అరోరా గారు మంచి టీమ్‌తో జ‌టాధ‌ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయ‌టం చాలా బాగుంది. విజువ‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఓ అద్భుత‌మైన సినిమాను మీ ముందుకు తీసుకెయ్ రాబోతున్నాం అని తెలిపారు.

ఈ సినిమాని నిర్మాత‌లు ప్రేర‌ణ అరోరాతో పాటు శివివ‌న్ నారంగ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ లు నిర్మిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించబోతుంది. అలాగే విలన్ పాత్రలో కూడా మరో బాలీవుడ్ స్టార్ నటించబోతుంది అని సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు. ప్ర‌స్తుతం జ‌టాధ‌ర సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవ్వనుంది.