NTR Koratala Siva Devara Part 1 Movie New Release Date Announced
Devara Release Date : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా దేవర సినిమా భారీగా తెరకెక్కుతుంది. దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రానుందని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే దేవర గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
Also Read : HanuMan : తక్కువ ధరలో హనుమాన్ టిక్కెట్లు.. ఎక్కడ? ఎప్పటి నుండి..
దేవర పార్ట్ 1 సినిమా 10 అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. దసరా టార్గెట్ పెట్టుకొని పండక్కి ఎన్టీఆర్ బాక్సాఫీస్ బద్దలుకొట్టడానికి వస్తున్నాడు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్ ని చివరిసారిగా మార్చ్ 2022 లో RRR సినిమాతో తెరపై చూసారు. ఇప్పటికే రెండేళ్లు అవుతుంది. ఇంకా అక్టోబర్ దాకా ఎదురుచూడాలా అని ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, VFX వర్క్ చాలా ఉండటంతోనే సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టు సమాచారం.
The Lord of Fear is unleashing his tsunami of electrifying action on 10.10.24 ?#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @NTRArtsOfficial @DevaraMovie… pic.twitter.com/CXSDy4m4dc
— Devara (@DevaraMovie) February 16, 2024