HanuMan : తక్కువ ధరలో హనుమాన్ టిక్కెట్లు.. ఎక్కడ? ఎప్పటి నుండి..

హనుమాన్ మూవీ మేకర్స్ టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం పాటు ఈ ధరలు అమలులో ఉంటాయట. ఎక్కడంటే?

HanuMan : తక్కువ ధరలో హనుమాన్ టిక్కెట్లు.. ఎక్కడ? ఎప్పటి నుండి..

Hanuman Movie Ticket Rates Cut

HanuMan : సంక్రాంతి పండుగకు రిలీజైన ‘హనుమాన్’ సినిమా ఇంకా వీర విహారం చేస్తోంది. తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకు ఇంకా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గిస్తూ మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. అది ఎక్కడ? ఎప్పటినుండి? అంటే..

హనుమాన్ మేనియా ఇంకా కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల ఇంకా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మరింత మంది ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేలా టికెట్ ధరలు తగ్గిస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అదీ నైజాం ఏరియాలో ఒక వారం రోజుల పాటు టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు ఈ ధరలు అమలులో ఉంటాయి. సింగిల్ స్క్రీన్‌లో రూ.175 ఉన్న దర రూ.100కు మల్టీపెక్స్‌లలో రూ.295 ఉన్న ధర రూ.150 కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా? వైరల్ అవుతున్న టైటిల్..

తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. ఇక హనుమాన్ డిజిటల్ హక్కులు జీ5 దక్కించుకుంది. మార్చి మొదటి లేదా రెండవ వారంలో హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అకాశం కనిపిస్తోంది.