SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా? వైరల్ అవుతున్న టైటిల్..

తాజాగా మహేష్ - రాజమౌళి సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా? వైరల్ అవుతున్న టైటిల్..

Mahesh Babu Rajamouli SSMB 29 Movie Title goes Viral

Updated On : February 16, 2024 / 3:58 PM IST

SSMB 29 Title : రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా ఇండియానా జోన్స్ లాంటి కథతో తీయబోతున్నట్టు రాజమౌళి చెప్పారు. ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మొదలుపెట్టారని, స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

ఈ సినిమా పనులు రెగ్యులర్ గా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందుకే గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. రాజమౌళి – మహేష్ సినిమాలో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామని తీసుకున్నట్టు, ఈ సినిమా కోసం తన టెక్నికల్ టీంని కూడా రాజమౌళి మారుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక మహేష్ జర్మనీకి వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చినట్టు కూడా తెలుస్తుంది.

Also Read : Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?

తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాకు ఇంకా అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించకపోయినా ఇప్పుడు ‘మహారాజ’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. RRR సినిమా సమయంలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేర్ల నుంచి లెటర్స్ తీసుకొని RRR వర్కింగ్ టైటిల్ తో మొదలుపెట్టినా చివరకు అదే RRR పేరుతోనే (రౌద్రం రణం రుధిరం)అంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మహేష్ పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకొని ‘మహారాజ’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం. మరి RRR లాగే మహేష్ – రాజమౌళి సినిమాకు కూడా ఇలాగే టైటిల్ ఇస్తారా? లేదా ఇంకేదైనా టైటిల్ మారుస్తారా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.