Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?

ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సమాచారం. మొదట ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేసినప్పుడే 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేస్తున్నారు.

Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Release Date Revealed

Updated On : February 16, 2024 / 3:21 PM IST

Double Ismart : పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పూరికి, రామ్ కి మంచి హిట్ ఇచ్చింది ఈ సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ ఫ్లాప్స్ బాట పట్టడంతో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తో వస్తున్నారు. ‘డబల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని తీసుకొస్తున్నారు. పూరి దర్శకత్వంలో రామ్ అదే మాస్ లుక్ తో సంజయ్ దత్ విలన్ గా తెరకెక్కుతుండగా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సమాచారం. మొదట ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేసినప్పుడే 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వలేదని, ఇంకొంత షూట్ కూడా బ్యాలెన్స్ ఉందని అందుకే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Also Read : Gopika : గోపిక ఏంటి ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేనంతగా

ఇస్మార్ట్ శంకర్ ఈ సారి డబల్ ఇస్మార్ట్ అంటూ థియేటర్స్ లోకి జూన్ 14న రాబోతున్నట్టు తెలుస్తుంది. సమ్మర్ హాలిడేస్ అయిపోయే టైంకి వచ్చి థియేటర్స్ లో ఇంకో భారీ హిట్ కొట్టడానికి రామ్ – పూరి ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.