NTR Landed in Hyderabad after naatu naatu receiving Oscar huge fans gathered at airport
NTR : RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడంతో ఆస్కార్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేడుకలకు RRR టీం అంతా హాజరయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుకల తర్వాత RRR టీం అమెరికాలో ఘనంగా పార్టీ కూడా చేసుకున్నారు. ఇక ఆస్కార్ హంగామా అయిపోవడంతో ఒక్కొక్కరు ఇండియాకు బయలుదేరుతున్నారు.
తాజాగా నేడు ఉదయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చేశారు. నేడు తెల్లవారు జామున ఎన్టీఆర్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. నాటు నాటు ఆస్కార్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తెలుగు గడ్డ మీద అడుగుపెడుతుండటంతో, ఎన్టీఆర్ వస్తున్నాడని సమాచారం రావడంతో భారీగా ఎన్టీఆర్ అభిమానులు, మీడియా ఎయిర్ పోర్ట్ వద్దకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ వద్ద హంగామా చేశారు. అభిమానులు ఎన్టీఆర్ ని చుట్టూ ముట్టరు.
Ram Charan : మోదీతో కలిసి ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో మాట్లాడబోతున్న రామ్ చరణ్..
ఇక ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబోస్, కీరవాణి గారు ఆస్కార్ వేదికపై అవార్డు తీసుకున్న మూమెంట్ ఎప్పటికి మరచిపోలేము. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు అందుకున్నాము అంటే ప్రేక్షకుల వల్లే. ప్రేక్షకులు చాలా ప్రేమని చూపించారు మా మీద, వారి అండతోనే ఆస్కార్ సాధించాము అని అన్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ వాహనంతో పాటు ర్యాలీగా సిటీలోకి వచ్చారు.