శివరాత్రికి మహానాయకుడు

మహా శివరాత్రి సందర్భంగా.. మార్చి 1న మహానాయకుడుని రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 08:58 AM IST
శివరాత్రికి మహానాయకుడు

Updated On : February 5, 2019 / 8:58 AM IST

మహా శివరాత్రి సందర్భంగా.. మార్చి 1న మహానాయకుడుని రిలీజ్.

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ, నందమూరి తారక రామారావు జీవిత కథతో రెండు పార్ట్‌‌లుగా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కగా, ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర పరాజయం తప్పలేదు. ఇక రెండవ భాగం, ఎన్టీఆర్ మహానాయకుడు బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ రిజల్ట్‌నిదృష్టిలో పెట్టుకుని, మరింత శ్రద్ధతో సెకండ్ పార్ట్‌ని తీర్చిదిద్దుతున్నారు.

ముందుగా జనవరి 24, తర్వాత ఫిబ్రవరి 7న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. దాని తర్వాత 14 లేదా 15, 21 లేదా 22న రిలీజవుతుందన్నారు. ఆ డేట్స్‌న కూడా రిలీజ్ కష్టం అనే వార్తాలు వినబడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా.. మార్చి 1న మహానాయకుడుని రిలీజ్ చెయ్యనున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఫస్ట్ పార్ట్ రిజల్ట్‌తో నిరాశ పడ్డ అభిమానులు.. మహానాయకుడుపై చాలా ఆశలు పెట్టుకున్నారు.