NTR Neel
NTR Neel : బాహుబలి తర్వాత సినిమా స్టైల్ మారిందనడంలో సందేహం లేదు. అక్కర్లేకపోయినా, అవకాశం లేకపోయినా, సినిమాలో దమ్ము లేకపోయినా పాన్ ఇండియా అని ఊదరగొడుతున్నారు. పైగా రెండు పార్టులు అని ప్రకటిస్తున్నారు. పెద్ద సినిమాలు, స్టార్ హీరో సినిమాలే కాదు కొన్ని చిన్నా చితకా సినిమాలు కూడా రెండో పార్ట్ ప్రకటిస్తున్నారు. కానీ ఆ రెండో పార్ట్ మాత్రం రావట్లేదు.(NTR Neel)
బాహుబలి తర్వాత తెలుగులో పుష్ప తప్ప రెండో పార్ట్ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. అయినా రెండు పార్టులు అంటూ అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా రెండు పార్టులు అని వినిపిస్తుంది. ఇటీవల డ్రాగన్ సినిమాకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ బ్రేక్ లో స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ జరిగాయని, ఎన్టీఆర్ కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని వార్తలు వచ్చాయి. నవంబర్ మూడో వారం నుంచి డ్రాగన్ షూట్ మళ్ళీ మొదలు కానుంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ నీల్ సినిమా దాదాపు మూడు గంటల 40 నిమిషాల పైన వస్తుండటంతో ఇంకొంత యాడ్ చేసి రెండు పార్టులుగా తీయబోతున్నారని టాక్. డ్రాగన్ మొదటి పార్ట్ చివర్లో పార్ట్ 2 కి లీడ్ ఇస్తారట. అయితే మిగతా సినిమాల్లాగా కాకుండా రెండు పార్టులు ఒకేసారి షూట్ చేసి తర్వాత నెలల గ్యాప్ తో డ్రాగన్ రెండు పార్టులు విడుదల చేస్తారట.
ఆల్రెడీ ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ – నీల్ సలార్ సినిమాలు కూడా రెండో పార్ట్ అనౌన్స్ చేసాయి కానీ అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. దేవర సినిమాకు అయితే పార్ట్ 2 అవసరం లేకపోయినా లాగారని చాలా మంది అభిప్రాయపడ్డారు. మూడు గంటల 40 నిమిషాల పైన వస్తే ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా చేస్తే బెటర్ కానీ ఇంకా సాగదీసి రెండు పార్టులు ఎందుకు? ఉన్న సినిమాలకే రెండో పార్ట్ వస్తుందో రాదో తెలియట్లేదు, వచ్చినా సక్సెస్ అవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు ఇంకో సినిమాకు రెండో పార్ట్ అవసరమా అని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండో పార్ట్ వల్ల హీరోల డేట్స్, టైం కూడా వేస్ట్ అవుతుంది అంటున్నారు. దాని బదులు కొత్త సినిమా ఇంకోటి చేసేయొచ్చు కదా అని ఫీల్ అవుతున్నారు.
Also Read : SSMB 29 : మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే.. భారీగా SSMB29 ఫస్ట్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?