SSMB 29 : మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే.. భారీగా SSMB29 ఫస్ట్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?

రాజమౌళి -మహేష్ సినిమా మొదటి అప్డేట్ నవంబర్ లో ఇస్తామని ప్రకటించారు. (SSMB 29)

SSMB 29 : మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే.. భారీగా SSMB29 ఫస్ట్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?

SSMB 29

Updated On : November 2, 2025 / 1:41 PM IST

SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం బాహుబలి రీ రిలీజ్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉండటంతో ఈ సినిమా షూట్ కి గ్యాప్ వచ్చింది. నవంబర్ చివర్లో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన వారణాసి సెట్ లో చేస్తారని సమాచారం.(SSMB 29)

అయితే రాజమౌళి -మహేష్ సినిమా మొదటి అప్డేట్ నవంబర్ లో ఇస్తామని ప్రకటించారు. నిన్న నవంబర్ 1న మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విట్టర్లో ఈ సినిమా అప్డేట్ గురించి సరదాగా ట్వీట్స్ వార్ చేసుకున్నారు. కాస్త లేట్ అయినా ఈ నెలలోనే SSMB29 మొదటి అప్డేట్ ఉంటుందని ఇండైరెక్ట్ గా రాజమౌళి చెప్పారు.

Also Read : Prasanth Varma : హనుమాన్ డైరెక్టర్ పై నిర్మాత ఫిర్యాదు.. వంద కోట్లు ఇవ్వాల్సిందే.. కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

తాజాగా టాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. రాజమౌళి ప్రమోషన్స్ అంతా డిఫరెంట్ గా ఉంటాయని తెలిసిందే. SSMB29 టైటిల్ నవంబర్ 15 న రిలీజ్ చేస్తారని, టైటిల్ ఒక మోషన్ పోస్టర్ వీడియోలాగా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ టైటిల్ లాంచ్ కి భారీగా ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. రామోజీ ఫిలిం సిటీలో ఓపెన్ గ్రౌండ్ లో ఫ్యాన్స్ మధ్యలో SSMB29 టైటిల్ ని రివీల్ చేస్తారని తెలుస్తుంది. గతంలో కల్కి ఈవెంట్ చేసినట్టు చేస్తారని టాక్.

ఇక రాజమౌళి ఏం చేసినా డబ్బులు రావాల్సిందే. అలా పక్కాగా ప్లాన్ చేస్తారు. అందుకే ఈ ఈవెంట్ ని యూట్యూబ్ లో కాకుండా జియో హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో మహేష్ ఫ్యాన్స్ నవంబర్ 15 న జరిగే ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read : Venu Swamy : అమ్మ హాస్పిటల్ లో.. లక్షల్లో బిల్లు.. డబ్బుల కోసం వేణుస్వామికి ఫోన్ చేస్తే.. విష్ణుప్రియ ఎమోషనల్..