Rajashekar : ‘ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నా.. కరోనాలో నడవలేని పరిస్థితి.. రాజశేఖర్ కామెంట్స్ వైరల్..
తాజాగా బైకర్ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ సినిమాల గురించి, తన హెల్త్ గురించి వ్యాఖ్యలు చేసారు. (Rajashekar)
Rajashekar
Rajashekar : ఒకప్పుడు స్టార్ హీరోగా సినిమాలతో మెప్పించిన రాజశేఖర్ గత కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కరోనాతో బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఇటీవలే రాజశేఖర్ పూర్తిగా కోలుకోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. రాజశేఖర్ తాజాగా శర్వానంద్ బైకర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు.(Rajashekar)
తాజాగా బైకర్ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ సినిమాల గురించి, తన హెల్త్ గురించి వ్యాఖ్యలు చేసారు.
Also Read : Lady Anchor : సన్యాసం తీసుకోడానికి రెడీ అంటున్న హాట్ యాంకర్.. అది జరగకపోతే.. పదేళ్ల తర్వాత కాశీకే..
రాజశేఖర్ మాట్లాడుతూ.. నాకు వర్క్ లేకపోతే జైల్లో ఉన్నట్టు ఉంటుంది. కరోనా సమయంలో నేను నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. ఓ మూడు నెలల్లో మాములుగా కోలుకున్నాను కానీ సరిపోదు. ఆరు నెలల్లో పూర్తిగా రెడీ అయ్యా వర్క్ కావాలి అనుకున్నాను. హీరోగా దాదాపు వంద సినిమాలు చేశాను. అప్పట్లో అన్ని సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇప్పుడు ఎక్కువగా టైడ్ అయిపోయాను. ఓ రోజు ఇకపై ఏ రోల్ వచ్చినా చేయాలని ఫిక్స్ అయ్యాను.
ఆ తర్వాత చాలా మంది దర్శకులు వచ్చి కథలు వినిపించారు కానీ నాకు ఏవి నచ్చలేదు. నేను వర్క్ చేద్దామనుకున్నా మంచి సినిమాలు రావట్లేదని బాధలో ఉన్నప్పుడు ఈ బైకర్ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చింది. ఈ కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ షూట్ లో నాకు అన్ని చెప్పి చేయించుకున్నారు. నటుడిగా ఈ సినిమాలో రోజూ షూట్ అయ్యాక సంతృప్తిగా ఉండేది. నేను కూడా నిర్మాతగా సినిమాలు చేశాను. కానీ ఇప్పటి సినిమాలు బడ్జెట్ చూస్తే భయమేస్తుంది అని అన్నారు.
తన హెల్త్ గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ అభిలాష్ ఈ ఈవెంట్ కి వచ్చి మాట్లాడాలి అన్నారు. కానీ నేను ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS)తో చాలా రోజులుగా బాధపడుతున్నా. దాని వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఇలా స్టేజిపై మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏదేదో మాట్లాడేస్తాను. అయినా సరే మాట్లాడదామని వచ్చాను అని అన్నారు.
