NTR : అమెరికాలో ఎన్టీఆర్ – నీల్ సినిమా..? అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ పోస్ట్ వైరల్..

హైదరాబాద్ లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు. (NTR)

NTR

NTR : ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాతో రాగా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆల్రెడీ కొంత షూటింగ్ కర్ణాటకలో జరుపుకుంది. అయితే ఈ సినిమా త్వరలో అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది సమాచారం.(NTR)

తాజాగా హైదరాబాద్ లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు. ఈ ఫోటోలను షేర్ చేసి.. ఎన్టీఆర్ కు కాన్సులేట్ లోకి స్వాగతం. ఎన్టీఆర్ ప్రస్తుతం, రాబోయే ప్రాజెక్ట్స్ అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రమంలో అమెరికా – ఇండియా పార్టనర్ షిప్, జాబ్స్ క్రియేట్ చేయడం, ఇరు దేశాల మధ్య బంధం బలపడనుంది అని రాసుకొచ్చారు.

Also Read : Kushi : పవన్ కళ్యాణ్ OG రిలీజ్ రోజే ‘ఖుషి’ రీ రిలీజ్..

దీంతో ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ అమెరికాలో జరగబోతుందని, అందుకే ఎన్టీఆర్ US కాన్సులేట్ కి వెళ్లారని సమాచారం. మరి ఎన్టీఆర్ – నీల్ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.