Kushi : పవన్ కళ్యాణ్ OG రిలీజ్ రోజే ‘ఖుషి’ రీ రిలీజ్..

పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ అయ్యే రోజే ఖుషి సినిమా రీ రిలీజ్ అవుతుంది. (Kushi)

Kushi : పవన్ కళ్యాణ్ OG రిలీజ్ రోజే ‘ఖుషి’ రీ రిలీజ్..

Kushi

Updated On : September 16, 2025 / 5:48 PM IST

Kushi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. పవన్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నారు.(Kushi)

అయితే అదే రోజు ఖుషి సినిమా రీ రిలీజ్ అవుతుంది. అదేంటి పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ పెట్టుకొని ఖుషి రీ రిలీజ్ ఎందుకు అనుకుంటున్నారా? రిలీజ్ అయ్యేది విజయ్ నటించిన తమిళ్ సినిమా ఖుషి. తెలుగులో పవన్ కళ్యాణ్ – భూమిక ఖుషి చేసే ముందు దర్శకుడు SJ సూర్య పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ముందు తమిళ్ లో విజయ్ – జ్యోతికలతో అదే కథ, అదే టైటిల్ తో ఖుషి సినిమా చేసాడు.

Also Read : Sandy Master : OG సినిమాలో ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన కిష్కింధపురి విలన్.. సినిమా అయితే మాస్ అంటూ..

తమిళ్ లో కూడా ఖుషి సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తమిళ్ లో రిలీజయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా తమిళనాడులో శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, తమిళ్ బోర్డర్ లో ఉన్న చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల కూడా విజయ్ ఖుషి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.

 

Also Read : Naresh : నాకు ఆ లోటు ఎప్పుడూ ఉంది.. సూసైడ్ చేసుకుందామని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను.. వీకే నరేష్ కామెంట్స్ వైరల్..