Sandy Master : OG సినిమాలో ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన కిష్కింధపురి విలన్.. సినిమా అయితే మాస్ అంటూ..
కిష్కింధపురి సినిమాలో విలన్ గా అదరగొట్టిన శాండీ మాస్టర్ తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. (Sandy Master)

Sandy Master
Sandy Master : ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాతో వచ్చి భయపెట్టాడు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో తమిళ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ విలన్ గా నటించారు. ఫిజికల్లీ ఛాలెంజెడ్ పాత్రలో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి అందర్నీ మెప్పించారు శాండీ మాస్టర్.(Sandy Master)
డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం కొరియోగ్రాఫర్ గా మారిన శాండీ మాస్టర్ ఇప్పుడు ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. విజయ్ లియో సినిమా, ఇటీవల హిట్ అయిన మలయాళం సినిమా లోక, ఇప్పుడు కిష్కింధపురి.. ఇలా మూడు సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు శాండీ మాస్టర్. తాజాగా శాండీ మాస్టర్ తెలుగు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
శాండీ మాస్టర్ మాట్లాడుతూ.. తెలుగులో నేను రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక సాంగ్ చేశాను. రీసెంట్ గా OG సినిమా ప్రమోషనల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. తమన్ గారితో, సుజీత్ గారితో కలిసి వర్క్ చేశాను. సినిమాలో సాంగ్ చేయలేదు కానీ కేవలం OG ఫైర్ స్టార్మ్ సాంగ్ కి ప్రమోషనల్ వీడియోకి కొరియోగ్రఫీ చేశాను. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు కాబట్టి కొంచెమే రిలీజ్ చేశారు. నేను కొర్రియోగ్రఫీ చేసింది ఇంకా ఉంది. సినిమా అయితే మాస్ ఉంటుందన్నాడు తమన్ అని తెలిపారు.
ఇటీవల OG సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అందులో సింగర్ రాజకుమారి, తమన్ స్టెప్పులు వేశారు. శాండీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసింది ఈ ప్రమోషనల్ సాంగ్ నే. మీరు కూడా ఫైర్ స్టార్మ్ సాంగ్ చూసేయండి..
Also Read : Priyanka Mohan : OG చీర కట్టుకొని వచ్చిన ప్రియాంక మోహన్.. ఆహా షోలో సందడి..