NTR – Rajamouli : మనకి సినిమాలు చేతకాక రాజమౌళిని అంటున్నాం.. రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్ వ్యాఖ్యలు..

తాజాగా ఎన్టీఆర్ - కొరటాల శివ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై స్పందించాడు.

NTR Sensational Comments on Rajamouli Flop Sentiment in Devara Interview

NTR – Rajamouli : రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా ఆ హీరో తర్వాతి సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని ఒక టాక్ ఉంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా అది నమ్ముతారు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కూడా అంతే. రాజమౌళితో సినిమా తీసిన ప్రతి హీరోకి ఆ తర్వాతి సినిమా కచ్చితంగా ఫ్లాప్. కొంతమందికి అయితే ఆ తరవాత రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యేవి.

దీంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు అందరూ అదే ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ RRR తర్వాత దేవరతో హిట్ కొట్టి రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడని అంటున్నారు అందరూ. ఆ సెంటిమెంట్ మొదలయింది కూడా ఎన్టీఆర్ తోనే. ఇన్నేళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ మళ్ళీ ఎన్టీఆర్ బ్రేక్ చేసాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గొప్పగా చెప్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ఇదే చెప్తూ ట్వీట్ వేయడం గమనార్హం.

Also Read : Maa Nanna Super Hero Trailer : సుదీర్ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది..

అయితే తాజాగా ఎన్టీఆర్ – కొరటాల శివ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై స్పందించాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేసాం. అంతే కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది. అయినా ఈ Myth Breaker అనేది కొంచం బాగానే ఉంది వినడానికి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మనకి సినిమాలు తీయడం చేతకాక అలా అన్నారు అని ఎన్టీఆర్ అనడంతో టాలీవుడ్ లో కూడా ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి.