Maa Nanna Super Hero Trailer : సుదీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ వచ్చేసింది..
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’.

Sudheer Babu Maa Nanna Super Hero Trailer out now
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్ణ కథానాయిక. సాయాజీ షిండే, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును దూరం చేసింది.. దాని విలువ పాతిక సంవత్సరాలు అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. నాన్న సెంటిమెంట్‌తో సినిమా ఉండనున్నట్లుగా ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Khadgam Movie : 22 ఏళ్ళ తర్వాత ఖడ్గం రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నాడంటే..