Khadgam Movie : 22 ఏళ్ళ తర్వాత ఖడ్గం రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నాడంటే..
22 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

Khadgam Movie Re Releasing Details Here Srikanth Krishna vamsi Comments in Press Meet
Khadgam Movie : శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్రాజ్.. ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా 2002 లో రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.
ఖడ్గం సినిమాని అక్టోబర్ 18న రీ రిలీజ్ చేస్తున్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి కృష్ణ వంశీ, శ్రీకాంత్, శివాజీ రాజా, షఫీ.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో షఫీ మాట్లాడుతూ.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఖడ్గం ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చి నా వనవాసానికి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు అని చెప్పారు.
Also Read : Matka Teaser : వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్.. అదిరిపోయింది
శివాజీ రాజా మాట్లాడుతూ.. ఇటీవలే మురారి పండుగ చేసుకున్నాం ఇప్పుడు ఖడ్గం రీ రిలీజ్ అవుతుంది. నేను ఖడ్గంలో మొదట చేయను అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో మంచి పేరు దీనికే వచ్చింది అని తెలిపారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనరేషన్స్ మారినా పేట్రియేటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా. అసలు ఖడ్గం సినిమాలో నిర్మాత మధు మురళి నన్ను వద్దు అన్నారు మొదట కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. కృష్ణవంశీ మాట్లాడుతూ.. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి తీసాను. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ, నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు అని అన్నారు.