NTR – CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. దేవర కోసం..

దేవరకు టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు.

NTR Special Thanks to CM Revanth Reddy for Devara Permissions

NTR – CM Revanth Reddy : దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. థియేటర్స్ వద్ద బ్యానర్లు కటౌట్స్ హడావిడి మొదలైంది. ఇక పెద్ద సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఏపీలో దేవరకు టికెట్ రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వడంతో ఎన్టీఆర్, మూవీ యూనిట్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు.

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాకు తెలంగాణలో కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. టికెట్ పెంపు, ఎక్స్ ట్రా షోలకు ఓకే చెప్పింది ప్రభుత్వం. తెలంగాణలో మొదటి రోజు 29 థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట స్పెషల్‌ షోకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే అన్ని థియేటర్స్ లో 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు అన్ని షోలకు 100
రూపాయల వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో 25 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు.

Also Read : Devara: దేవర సక్సెస్ మీట్‌ను ఓ లెవెల్‌లో నిర్వహించాలని ప్లాన్?

దేవరకు టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి దేవర కోసం అనుమతులు ఇస్తూ GO రిలీజ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సినీ పరిశ్రమకు మీ సపోర్ట్ కు నా కృతజ్ఞతలు అని తెలిపారు దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.