Devara: దేవర సక్సెస్ మీట్‌ను ఓ లెవెల్‌లో నిర్వహించాలని ప్లాన్?

అది కూడా ఏపీలో సక్సెస్ మీట్ నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Devara: దేవర సక్సెస్ మీట్‌ను ఓ లెవెల్‌లో నిర్వహించాలని ప్లాన్?

NTR

Updated On : September 23, 2024 / 9:44 PM IST

భారీ బడ్జెట్..అంతకు మంచి అంచనాలు..దానికి తగ్గట్లుగా జూనియర్ కామెంట్స్‌తో దేవర మూవీపై ఫ్యాన్స్‌ అంచనాలు ఓ లెవల్‌లో ఉన్నాయి. దేవర సినిమా రావడం కొంచెం లేట్ అయినా కాలర్ ఎగరేసేలా ఉంటుందంటూ ఆ మధ్య ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే పోస్టర్, మూవీ టీజర్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే నోవాటెల్‌ హోటల్‌లో ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం పెద్ద ఎత్తున అరేంజ్‌మెంట్స్ చేశారు. అయితే నోవాటెల్‌ ఆడిటోరియమ్‌ కెపాసిటీని మించి అభిమానులు వచ్చారు. దీంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. కంట్రోల్‌ చేయలేనంత క్రౌడ్‌ రావడంతో ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేశారు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు, మూవీ యూనిట్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో మూవీ కావటంతో చాలా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా ఎన్నో విషయాలు పంచుకోవాలనుకున్న ఎన్టీఆర్‌కు అది కుదరలేదు.

అయితే ఇప్పుడు రిలీజ్‌కు ముందు ఇక ఏ ఈవెంట్ చేయలేని పరిస్థితి కావటంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. దీంతో దేవర టీం రిలీజ్ తర్వాత గ్రాండ్‌గా సక్సెస్ మీట్ చేయాలనుకుంటోంది. అది కూడా ఏపీలో సక్సెస్ మీట్ నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దేవరకు ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ థియేటర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

సక్సెస్ మీట్ ఓపెన్ ఏరియాలో సక్సెస్ మీట్‌ పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యాన్స్ తాకిడితో ఎన్టీఆర్‌ మూవీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం ఇది రెండోసారి. గతంలో ఆంధ్రావాలా ఈవెంట్ కూడా ఇలానే క్యాన్సిల్ అవ్వటంతో ఇక భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు ఎన్టీఆర్. ఏపీలో నిర్వహించే సక్సెస్ మీట్‌కు పలువురు ప్రముఖులను ఇన్వైట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Devara Pre Release event : మేము పాసులు ఎక్కువ ఇవ్వలేదు.. ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు.. ‘దేవర’ ఈవెంట్ రద్దుపై ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ..