Devara Pre Release event : మేము పాసులు ఎక్కువ ఇవ్వలేదు.. ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు.. ‘దేవర’ ఈవెంట్ రద్దుపై ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ..

తాజాగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా దేవర ఈవెంట్ రద్దుపై వివరణ ఇస్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Devara Pre Release event : మేము పాసులు ఎక్కువ ఇవ్వలేదు.. ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు.. ‘దేవర’ ఈవెంట్ రద్దుపై ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ..

Event Management Company gives Clarity on Devara Pre Release event

Updated On : September 23, 2024 / 2:05 PM IST

Devara Pre Release event : నిన్న ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా అభిమానుల తాకిడి ఎక్కువయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈవెంట్ ని క్యాన్సిల్ చేసారు. ఇచ్చిన పాసుల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ రావడం, ఫ్యాన్స్ హోటల్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, పోలీసులతో గొడవ పెట్టుకోవడం, పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం.. ఈ సంఘటనలు అన్ని వైరల్ గా మారాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈవెంట్ ని సరిగ్గా నిర్వహించలేకపోయారు, ఎన్టీఆర్ కోసం ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారని తెలుసు కదా, ఈవెంట్ అవుట్ డోర్ లో పెట్టొచ్చు కదా అని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై విమర్శలు చేసారు.

Also Read : Mahesh Babu : సీఎంతో మహేష్ బాబు భేటీ.. బాబు లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..

తాజాగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా దేవర ఈవెంట్ రద్దుపై వివరణ ఇస్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ ట్వీట్ లో.. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్యాన్స్ కు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అందుకు మేము అభిమానులకు క్షమాపణలు చెప్తూ కొన్ని విషయాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాము. మేము ముందుగా అవుట్ డోర్ లోనే ప్లాన్ చేద్దాము అనుకున్నాము కానీ గణేష్ నిమజ్జనం, వర్షాల కారణంగా పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో ఇన్ డోర్ లో ప్లాన్ చేసాం. నోవాటెల్ హోటల్ లో మూడు హాళ్లు బుక్ చేసాము. అందులో 5500 మంది సరిపోతారు. పోలీసులు మాకు 4000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్స్ ఆధారంగా మేము కేవలం 4000 పాసులు మాత్రమే ఇచ్చాము. ఎక్స్‌ట్రా పాసులు ఇచ్చాము అనేది ఫేక్ న్యూస్. గతంలో మాకు 2 నుంచి 3 లక్షల మంది వచ్చిన ఈవెంట్స్ ని కూడా హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. కానీ దేవర ఈవెంట్ కు పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా 30 వేల మంది వరకు అభిమానులు రావడం, బారికేడ్స్ తోసుకొని లోపలి రావడంతో పరిస్థితులను కంట్రోల్ చేయలేకపోయాము. ఫ్యాన్స్ భద్రత కోసమే మేము ఈవెంట్ ని క్యాన్సిల్ చేసాము. చాలా మంది ఎన్టీఆర్ ని చూడటం కోసం ఎక్కడెక్కడ్నుంచో వచ్చారు. అభిమానులకు మేము క్షమాపణలు చెప్తున్నాము. త్వరలో మళ్ళీ దేవర ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేద్దాము అని తెలిపారు.