NTR Trending In India After Meeting With Amit Shah
NTR Trending In India: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోయేలా లేరు. రోజూ చాలా మంది ఆయన పర్ఫార్మెన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉన్నారు. అయితే తారక్ తన నెక్ట్స్ మూవీల కోసం రెడీ అవుతుండగా, తాజాగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నాడు.
Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు రెడీ అవుతుండటంతో అక్కడ తమ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుతున్న సందర్భంగా అమిత్ షా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లో నటుడు ఎన్టీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఎన్టీఆర్, అమిత్ షాలు ఎందుకు కలుసుకున్నారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుండి వీరి కలయికపై అనేక వార్తలు వస్తున్నాయి.
Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా నుంచి జూ.ఎన్టీఆర్‌కి పిలుపు
అయితే తారక్, అమిత్ షా మీటింగ్‌లో ఎలాంటి రాజకీయం లేదని.. కేవలం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన అమిత్ షా, ఇలా తారక్‌తో ప్రత్యేకంగా కలిశారని పలువురు అంటున్నారు. అటు రాజకీయ నేతలు ఈ భేటీలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ రాజకీయ పయనంపై చర్చ జరిగిందంటూ చెబుతున్నారు. మొత్తానికి అమిత్ షాతో తారక్ మీటింగ్ సెన్సేషన్ అనే చెప్పాలి.