Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.

Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..

Amit Shah Meets Jr NTR : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.

ఈ ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. బీజేపీ అగ్రనేతను ఎన్టీఆర్‌ కలవడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ వర్గాలు మాత్రం ఇది రాజకీయ భేటీ కాదంటున్నాయి. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్‌ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఇంకా ఏయే అంశాలపై చర్చించి ఉంటారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. సినీ గ్లామర్ ను వినియోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ ను తమవైపు అట్రాక్ట్ చేసే పనిలో పడింది. హైదరాబాద్ లో ఉండే ఏపీ సెటిలర్స్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలంటే సెటిలర్ల ఓట్లు చాలా కీలకం.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ బలంతో పాటు సినీ గ్లామర్ ను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఎవరితో భేటీ అయినా దానికి కచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. బీజేపీకి ఉపయోగపడే విధంగా ఆయన చర్చలు జరుపుతారు.

జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ మీట్ లో అనేక రాజకీయ అంశాలపై అమిత్ షా చర్చించినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీకి ముందు.. అమిత్ షా.. రామోజీరావును కూడా కలవడం ఆసక్తికర అంశం. ఓ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేయడంలో రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ కీలకం. దీంతో ఆ ఇద్దరినీ తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది.

అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ అజెండా అన్న బండి సంజయ్, భేటీలో రాజకీయం ఏమీ లేదన్నారు.

మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. మునుగోడులో బీజేపీ సభ ముగిసిన తర్వాత అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌కు వచ్చారు. నోవాటెల్‌లో అమిత్ షా, ఎన్టీఆర్‌ సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది.

ఇటీవల అమిత్‌ షా ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే పిలిచారని ప్రచారం జరుగుతోంది. కారణమేదైనా.. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగానూ ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఏయే అంశాలపై వీరిద్దరూ చర్చించారు? రాజకీయ పరమైనవా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎన్టీఆర్ తో భేటీ తర్వాత షా ట్వీట్..

ఎన్టీఆర్‌తో భేటీ విషయాన్ని అమిత్‌ షా తన ట్విటర్‌లో తెలిపారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈరోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.