NTR – Devara : ఇక తెలుగులో ‘దేవర’ ప్రమోషన్స్ లేనట్టే.. అమెరికాకు చెక్కేసిన ఎన్టీఆర్..

తెలుగులో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని ఫిక్స్ అయిపోయారు అంతా.

NTR went To America No More Devara promotions in Telugu States

NTR – Devara : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఈవెంట్ ని రద్దుచేశారు. అయితే దేవర సినిమాకు తెలుగులో ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఒక ప్రెస్ మీట్ కానీ, ఈవెంట్ కానీ తెలుగు స్టేట్స్ లో దేవర సినిమాకు చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపొయింది.

రిలీజ్ లోపు దేవర ప్రమోషన్స్ ఏవైనా తెలుగులో చేస్తారా అని ఫ్యాన్స్ అనుకుంటుంటే ఇక తెలుగులో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఇవాళ ఉదయం అమెరికాకు వెళ్లిపోయారు. లాస్‌ ఏంజిల్స్ లో జరిగే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ 2024 లో దేవర మూవీని ప్ర‌ద‌ర్శించనున్నారు. దీంతో ఎన్టీఆర్ అక్కడే దేవర మొదటి షో చూడటానికి ఇవాళ ఉదయం అమెరికాకు పయనమయ్యారు.

Also See : Janhvi Kapoor : ‘దేవర’ ఈవెంట్ కోసం లంగావోణీలో అందంగా రెడీ అయిన జాన్వీ.. ఈవెంట్ క్యాన్సిల్.. ఫొటోలు వైరల్..

ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోవడంతో ఇక తెలుగులో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని ఫిక్స్ అయిపోయారు అంతా. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ రెండు మూడు సినిమా ఈవెంట్స్ కి తప్ప అసలు ఫ్యాన్స్, మీడియా ముందుకు రాలేదు. దేవరకి అయినా వచ్చి మాట్లాడుతాడు అనుకుంటే ఇలా అయింది అని ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.