×
Ad

NTR – Pranathi : చార్మినార్‌ వద్ద ఎన్టీఆర్‌ భార్య ప్రణతి షాపింగ్‌.. ఫోటో వైరల్‌!

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బయట పెద్దగా కనిపించదు. తాజాగా ఈమె చార్మినార్ వద్ద షాపింగ్ చేస్తూ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  • Published On : April 17, 2023 / 04:57 PM IST

NTR wife Lakshmi Pranathi shopping at Hyderabad Charminar night bazar

NTR – Pranathi : టాలీవుడ్ లో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ భార్యలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. తమ కుటుంబం మరియు భర్తకి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ (NTR) భార్య లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi) సోషల్ మీడియాలో కనిపించదు. ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను చాలా అరుదుగా షేర్‌ చేస్తుంటాడు. తాజాగా ప్రణతికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

NTR30 : డబల్ ట్రీట్ సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్.. NTR30 పై బాలీవుడ్ సర్కిల్‌లో ఇంటరెస్టింగ్ న్యూస్!

రంజాన్ (Ramadan) మాసం కావడంతో హైదరాబాద్ చార్మినార్ వద్ద సందడి మొదలైంది. నైట్‌ బజార్‌లో షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి కూడా నైట్‌ బజార్‌ షాపింగ్ కి వచ్చింది. చార్మినార్ వద్ద ఆమెను గుర్తించిన అభిమానులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ప్రణతి వెనుక ఇద్దరు బాడీగార్డ్స్ కూడా కనిపిస్తున్నారు. స్టార్‌ హీరో వైఫ్ అయ్యుండి ఇలా సింపుల్ గా చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తూ కనిపించడంతో నెటిజెన్లు ఆమె సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటున్నారు.

 

NTR wife Lakshmi Pranathi shopping at Hyderabad Charminar night bazar

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. NTR30 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో హిందీ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు, సాబు సిరిల్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు.