NTR30 : డబల్ ట్రీట్ సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్.. NTR30 పై బాలీవుడ్ సర్కిల్‌లో ఇంటరెస్టింగ్ న్యూస్!

NTR30 గురించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ చేయబోతున్నాడట. ఆ పాత్రలు ఏంటంటే..

NTR30 : డబల్ ట్రీట్ సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్.. NTR30 పై బాలీవుడ్ సర్కిల్‌లో ఇంటరెస్టింగ్ న్యూస్!

NTR playing dual role in NTR30 Janhvi Kapoor heroine

NTR30 : ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ NTR30. RRR తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. సముద్రంలో భారీ నౌకలో జరిగే ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ని నిర్మించారు. ఇక ఈ సన్నివేశం కోసం హాలీవుడ్ మేకర్స్ ని రంగంలోకి దించారు.

NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

ఆక్వా మ్యాన్ వంటి సినిమాకి VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండగా, ట్రాన్స్‌ఫార్మర్స్ సినిమాకు వర్క్ చేసిన ‘కెన్నీ బెట్స్’ ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ గా చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి మరో అదిరిపోయే న్యూస్ బాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. తండ్రి, కొడుకులుగా ఎన్టీఆర్ ఆడియన్స్ ని అలరించబోతున్నాడని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు. అయితే గతంలో ఎన్టీఆర్ ఆంద్రావాలా సినిమాలో తండ్రీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.

NTR: తారక్‌తో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ జాన్వీ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్స్ తో ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.