NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే పాన్ ఇండియా వైడ్ మార్కెటింగ్ జరుగుతుందని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రణ్‌వీర్ సింగ్‌ని కాదని 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' సినిమా కోసం..

NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

NTR Allu Arjun are in the race for The Immortal Ashwatthama Ranveer Singh out

NTR – Allu Arjun : పాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు హీరోలకు డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు RRR, పుష్ప సినిమాలతో నార్త్ లో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ మేకర్స్.. టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే నార్త్ టు సౌత్ మార్కెటింగ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల హృతిక్ రోషన్ (Hrithik Roshan) సినిమాకి ఎన్టీఆర్ ని ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ పేరులు వినిపిస్తున్నాయి.

NTR : వాళ్లందరికి స్పెషల్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ కోసం వచ్చిన అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్..

యూరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాని తెరకెక్కించిన ఆదిత్య ధర డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ చిత్రంలో ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ ని క్యాస్ట్ చేసుకునేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారట. గతంలో ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో ఈ మూవీలో హీరోగా విక్కీ కౌషల్ ని అనుకున్నాడు దర్శకుడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి అనుహ్యంగా నిర్మాత రోనీ తప్పుకున్నాడు. ఇక ఇటీవల ఈ ప్రాజెక్ట్ ని జియో స్టూడియోస్ టేక్ అప్ చేసింది.

Allu Arjun : శాకుంతలంలో అల్లు అర్హ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.. బన్నీ స్పెషల్ ట్వీట్

దీని తరువాత ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ని తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సినిమా కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేరులను పరిశీలిస్తున్నట్లు బి-టౌన్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకర్ని హీరోగా ఎంపిక చేసుకుంటే పాన్ ఇండియా వైడ్ మార్కెటింగ్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ లేదా బన్నీ ఎంట్రీ ఇవ్వొచ్చు.