NTR
NTR : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా వార్ 2(War 2). నేడు ఈ సినిమా రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రొటీన్ కథ కథనం అయినా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో మెప్పించారు అని అంటున్నారు ప్రేక్షకులు. మూడు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైగర్, పఠాన్, వార్.. ఇలా పలు సినిమాలు వచ్చాయి. త్వరలో మరిన్ని సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సోలో గా చేసిన హీరోలు వేరే సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తారు.
Also Read : War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ యాక్షన్ సినిమా..
అయితే ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. గతంలోనే ఎన్టీఆర్ సోలోగా ఈ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. నేడు వార్ 2 సినిమా క్లైమాక్స్ లో దేశం కోసం ఒక టైగర్, ఒక పఠాన్, ఒక కబీర్ వచ్చినట్టే రేపు ఒక రాఘవ కూడా రావొచ్చు అనే డైలాగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాఘవ, ఏజెంట్ విక్రమ్ అనే పేర్లతో కనిపిస్తాడు.
దీంతో ఎన్టీఆర్ సోలోగా స్పై సినిమా కచ్చితంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ సోలోగా స్పై యూనివర్స్ లో సినిమా ఉంటే ఆ సినిమాకు విక్రమ్ లేదా రాఘవ అనే టైటిల్ పెడతారేమో అని అనుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి సోలో సినిమా ఉండబోతుందని హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Oka Parvathi Iddaru Devadasulu : ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’.. సరికొత్త టైటిల్ తో కొత్త సినిమా..