Nushrratt Bharuccha : ఎట్టకేలకు ఇండియాకు.. ఇజ్రాయిల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి..

నుష్రత్ భరూచా అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని నేడు తెల్లవారుజామున ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు.

Nushrratt Bharuccha Safely Return to India from Israel

Nushrratt Bharuccha :  ఇజ్రాయిల్(Israel) పై పాలస్తీనా దాడులకు పాల్పడుతుండటంతో ఇజ్రాయిల్ – పాలస్తీనా(Palestine) దేశాల మధ్య యుద్ధ వాతావరం నెలకొంది. ఇజ్రాయిల్ లో పలువురు భారతీయులు చిక్కుకున్నారు. వారిని క్షేమంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ లో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా చిక్కుకుపోయింది.

హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ భరూచా తో పాటు పలువురు ఇజ్రాయెల్ వెళ్లారు. ఆమె టీంలోని సభ్యుడు నుష్రత్ భరూచా అక్కడే చిక్కుకున్నట్టు నిన్న అక్కడి భారతీయ రాయబారి అధికారులకు తెలిపారు. నుష్రత్ భరూచా అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని నేడు తెల్లవారుజామున ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు. తాజాగా నుష్రత్ భరూచా ముంబై(Mumbai) ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది.

Also Read : Actor Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వచ్చే విమానం ఎక్కిన సినీనటి నుష్రత్

ముంబై ఎయిర్ పోర్ట్ లో నుష్రత్ భరూచా రాగా మీడియా మొత్తం ఆమెను చుట్టుముట్టింది. అయితే ఆమె ఏమి మాట్లాడకుండానే ఇంటికి వెళ్ళిపోయింది. నుష్రత్ భరూచా ఇండియాకు చేరుకుంది అని తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.