హైదరాబాద్‌లో ‘పద్దు’తో మిర్చి బజ్జి ఛాలెంజ్.. ‘నువ్వు నేను ప్రేమ’ టీమ్ సందడే సందడి..
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్ 'నువ్వు నేను ప్రేమ'.

Nuvvu Nenu Prema Mirchi Bajji Challenge in hyderabad
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు ఈ సీరియల్‌లోని నటీనటులు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ‘పద్దుతో మిర్చి బజ్జి ఛాలెంజ్’ ను నిర్వహించారు. దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తమ అభిమాన నటీనటులను ప్రత్యక్షంగా చూడడంతో పాటు కలిసి మాట్లాడే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఖైరతాబాద్‌లోని మునిసిపల్ గ్రౌండ్ గణేష్ సర్కిల్ దగ్గర ఈ కాంటెస్ట్ జరిగింది. అందమైన జంట స్టార్ పెయిర్, నువ్వు నేను ప్రేమ నటులను కలుసుకున్న అభిమానులు.. వారితో సెల్ఫీలు దిగారు. సీరియల్ తారాగణం మొత్తం ప్రేక్షకుల స్పందనకు పులకరించిపోయింది. ఎంతో ఉత్సాహభరిమైన వాతావరణంలో ఈ కాంటెస్ట్ జరిగింది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఆత్మీయ స్వాగతం పలికిన ఖైరదాబాద్ వాసులకు ఈ సందర్భంగా సీరియల్ బృందంతో పాటు స్టార్ మా ధన్యవాదాలు తెలియజేసింది. అదే సమయంలో వీక్షకులను వారి ఇష్టమైన షోల లను మరింత చేరువ చేసే ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కంటెంట్ సృష్టించేందుకు ఛానెల్ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు.