O cheliya
O Cheliya : ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపాశ్రీ కొపురు నిర్మాణంలో ఎం. నాగరాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు.
తాజాగా ‘ఓ.. చెలియా’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. మీరు కూడా ఓ చెలియా టీజర్ చూసేయండి..
టీజర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీం అంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది అని అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే హారర్, లవ్ జానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.