Tollywood : ‘పవర్ స్టార్’ మానియా ఇది.. రాత్రి నుంచే డ్యూటీ చేస్తున్న మొత్తం టాలీవుడ్.. నీల్, సందీప్ రెడ్డి, నాని, నాగ్ అశ్విన్, తేజ్..

చాలా ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు భారీ హైప్ రావడంతో మొత్తం టాలీవుడ్ రంగంలోకి దిగింది. (Tollywood)

Tollywood : ‘పవర్ స్టార్’ మానియా ఇది.. రాత్రి నుంచే డ్యూటీ చేస్తున్న మొత్తం టాలీవుడ్.. నీల్, సందీప్ రెడ్డి, నాని, నాగ్ అశ్విన్, తేజ్..

Tollywood

Updated On : September 25, 2025 / 11:34 AM IST

Tollywood : పవర్ స్టార్ అంటే బయట అభిమానులకే కాదు టాలీవుడ్ లో కూడా చాలా మందికి ఇష్టం, గౌరవం. ఆయన రాజకీయాల్లోకి వెళ్లి, ఎన్నో రిజెక్షన్స్ చూసి నిలబడి సక్సెస్ అయిన తీరు ఆయనపై మరింత ఇష్టాన్ని పెంచింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు చూస్తున్న ఫేమ్ తొలిప్రేమ, బద్రి, ఖుషి టైంలోనే పవన్ కళ్యాణ్ చూసేసాడు. అప్పట్నుంచే ఆయనకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ లో చాలా మందికి అనేక విషయాల్లో పవన్ సపోర్ట్ గా నిలిచారు. అందుకే హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు.. మొత్తం సినీ ప్రముఖులు ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారు.(Tollywood)

చాలా ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు భారీ హైప్ రావడంతో మొత్తం టాలీవుడ్ రంగంలోకి దిగింది. నిన్న రాత్రే హైదరాబాద్ విమల్ థియేటర్, AMB మాల్, శ్రీరాములు థియేటర్ లో సెలబ్రిటీలు అంతా సినిమా చూసారు. సాధారణంగా కొత్త సినిమా వస్తే కొంతమంది సినీ ప్రముఖులు, ఆ సినిమాకు దగ్గరి వాళ్ళు వెళ్లడం కామన్. కానీ ఇది పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో టాలీవుడ్ అంతా దిగి వచ్చారు.

Also Read : Sujeeth : సుజీత్ కి గుడి కట్టినా తప్పు లేదు.. ఫుల్ హ్యాపీలో పవన్ ఫ్యాన్స్..

రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, నాని, నాగ్ అశ్విన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ వాసు, నిహారిక, కిరణ్ అబ్బవరం, నిర్మాత SKN, మారుతీ, హరీష్ శంకర్, రవితేజ పిల్లలు, అకిరా నందన్, ఆద్య, నందిని రెడ్డి, సందీప్ రాజ్, అశ్విన్, సప్తగిరి, గెటప్ శ్రీను, తమన్, మెహర్ రమేష్, డైరెక్టర్ బాబీ, నాగవంశీ, నిఖిల్, మహేష్ అల్లుడు అశోక్ గల్లా.. వీళ్ళే కాకుండా చాలా మంది నిర్మాతలు, సింగర్స్, చిన్న ఆర్టిస్టులు, జబర్దస్త్ బ్యాచ్ ఇలా సినీ ప్రముఖులు అంతా రాత్రే థియేటర్స్ కి వెళ్లి ప్రీమియర్లు చూసారు. ఈ సెలబ్రిటీలు సినిమా చూస్తూ థియేటర్స్ లో రచ్చ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.

పైగా వాళ్లంతా సినిమా చూడటమే కాక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో మాములు ఆడియన్స్ లా సినిమా గురించి పెట్టి ఎంజాయ్ చేసారు. పలువురు ట్విట్టర్లో సినిమా అదిరిపోయింది అంటూ రివ్యూ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వీళ్లేంట్రా బాబు కల్ట్ ఫ్యాన్స్ కంటే దారుణంగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి OG ఫీవర్ టాలీవుడ్ అంతా పాకింది. OG సక్సెస్ తో టాలీవుడ్ కూడా పండగ చేసుకుంటుంది.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..