ఇది మన సినిమా ట్రైలర్‌ కాదు.. ఈ థియేటర్‌లో నెక్ట్స్‌ వచ్చే సినిమా ట్రైలర్‌..

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న‘ఓ పిట్టకథ’ ప్రీ-టీజర్..

  • Published By: sekhar ,Published On : February 1, 2020 / 06:19 AM IST
ఇది మన సినిమా ట్రైలర్‌ కాదు.. ఈ థియేటర్‌లో నెక్ట్స్‌ వచ్చే సినిమా ట్రైలర్‌..

Updated On : February 1, 2020 / 6:19 AM IST

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న‘ఓ పిట్టకథ’ ప్రీ-టీజర్..

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌ెస్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో  పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌ెస్టింగ్ పిట్టక‌థ‌ను సెల్యులాయిడ్ మీద చూపించ‌బోతోంది భ‌వ్య క్రియేష‌న్స్. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ, వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’ (It’s a long story)..

Image

ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రానా దగ్గుబాటి ఈ చిత్ర ప్రీ-టీజర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూపిస్తూ.. ఇదేంట్రా బాబు, టైటిల్‌కి ప్రీ-టీజర్‌కి అసలు సంబంధమే లేదు అనుకుంటండగా.. వెంకటలక్ష్మీ టాకీస్ అనే థియేటర్ చూపించి ‘ఇది మన సినిమా ట్రైలర్‌ కాదు.. ఈ థియేటర్‌లో నెక్ట్స్‌ వచ్చే సినిమా ట్రైలర్‌.. మన సినిమా టీజర్, ట్రైలర్.. కమింగ్ సూన్’.. అంటూ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీమ్..

Image

ఫిబ్రవరి 7న ‘ఓ పిట్టకథ’ టీజర్ రిలీజ్ చేయనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, కెమెరా : సునీల్ కుమార్ ఎన్, ఎడిటింగ్ : డి వెంకట్ ప్రభు, పాటలు : శ్రీ జో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అన్నే రవి.