October First Week Theatrical Releasing Movies in Telugu
Theatrical Releases : అక్టోబర్ మొదటివారంలో సినిమాల సందడి ఫుల్ గా ఉండనుంది. ఈ వారం ఏకంగా చిన్న, మీడియం సినిమాలు అన్ని కలిపి దాదాపు అరడజను పైనే రిలీజ్ కి రెడీ అయ్యాయి.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ‘రూల్స్ రంజన్’ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈసినిమాకి ప్రముఖ నిర్మాత AM రత్నం రిలీజ్ చేస్తున్నారు. నేహశెట్టి వరుసగా రెండు హిట్స్ తో ఫామ్ లో ఉంది. మరి ఈ సినిమా కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్(NTR) బామ్మర్ది నార్నె నితిన్(Narne Nithiin) ముఖ్య పాత్రలో, పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో మ్యాడ్ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించాడు. మ్యాడ్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కాబోతుంది.
కలర్స్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu). నవీన్ చంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.
సుధీర్ బాబు (Sudheer Babu) ఈసారి మరో కొత్త ప్రయోగంతో ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా కనిపిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.
శ్రీలంక క్రికెట్ ఆటగాడు, లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ‘800’ అనే సినిమా రాబోతుంది. ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ ‘మధుర్ మిట్టల్’ చేస్తున్నాడు. మహిమా నంబియార్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ బయోపిక్ అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.
సిద్దార్థ్ (Siddharth) హీరోగా అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిన్నా’. నిమిషా సజయన్ ముఖ్యపాత్రలో నటించింది. బాబాయికి, కూతురికి మధ్య అనుబంధంతో కూతురు కిడ్నాప్ అయితే హీరో ఎలా కనుక్కున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. తమిళ్ లో చిత్తా అనే పేరుతో ఆల్రెడీ రిలీజయి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో చిన్నా అనే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.
వీటితో పాటు తంతిరం, గన్స్ ట్రాన్స్ యాక్షన్, నేనే సరోజ లాంటి.. పలు చిన్న సినిమాలు కూడా రిలీజవుతున్నాయి.