Theatrical Releases : రేపొక్కరోజే ఏకంగా 10 సినిమాలు రిలీజ్.. కానీ..

ఈ వారం కూడా దాదాపు 10 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్ప అన్ని ఎవరికి తెలియని కొత్తవాళ్ళ సినిమాలే.

October Second Week Theatrical Releasing Movies

Theatrical Releases :  గత మూడు వారాలుగా పెద్ద సినిమాలు ఏమి రావట్లేదు. గత వారం ఒక అరడజను పైగా సినిమాలు రిలీజయి అందులో కొన్ని మీడియం సినిమాలు ఉన్నా ఒకటి రెండు తప్ప మిగిలినవి ఏవి ప్రేక్షకులని మెప్పించలేదు. ఈ వారం కూడా దాదాపు 10 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. కానీ అందులో ఒకటి రెండు తప్ప అన్ని ఎవరికి తెలియని కొత్తవాళ్ళ సినిమాలే.

ఇటీవల రామన్న యూత్ సినిమాతో మెప్పించిన అభయ్ నవీన్ కొత్తవాళ్లతో కలిసి ‘రాక్షస కావ్యం’ అనే సినిమాతో రేపు అక్టోబర్ 13న రాబోతున్నాడు. యూట్యూబర్ రవితేజ మహాదాస్యం హీరోగా నవదీప్ నిర్మాతగా సగిలేటి అథ అనే పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుంది. తమిళ్ హీరో జయం రవి, నయనతార జంటగా గాడ్ అనే డబ్బింగ్ సినిమా రాబోతుంది.

Also Read : Tiger Nageswara Rao : మరీ అంత ఎక్కువా? చర్చగా మారిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు రన్ టైం..

ఇవి తప్ప మిగిలినవి అన్ని కొత్త వాళ్ళు, చిన్న సినిమాలే ఉన్నాయి. మిస్టరీ, మధురపూడి గ్రామం అనే నేను, నీతోనే నేను, గుణసుందరి కథ, తంతిరం, ద్రోహి, పెళ్ళెప్పుడు.. అనే సినిమాలు రేపు అక్టోబర్ 13న రిలీజ్ కాబోతున్నాయి. నేడు మా ఊరి సైన్మా అనే ఓ చిన్న సినిమా రిలీజయింది. మరి ఈ చిన్న సినిమాల్లో ఏదైనా పెద్ద విజయం సాధిస్తుందేమో చూడాలి. ఇక వచ్చే వారం మాత్రం పండగా వారం కావడంతో స్టార్ హీరోల సినిమాలన్నీ బరిలోకి దిగుతున్నాయి.