Tiger Nageswara Rao : మరీ అంత ఎక్కువా? చర్చగా మారిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు రన్ టైం..

ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిడివి చర్చిగా మారింది.

Tiger Nageswara Rao : మరీ అంత ఎక్కువా? చర్చగా మారిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు రన్ టైం..

Raviteja Tiger Nageswara Rao Movie Run Time going Viral

Updated On : October 13, 2023 / 9:39 AM IST

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ద‌ర్శ‌కుడు వంశీతో కలిసి చేస్తున్న యాక్షన్ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాని స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిడివి చర్చిగా మారింది.

ఇటీవల ఏ సినిమా వచ్చినా 2 గంటల నుండి 2 గంటల 40 నిమిషాల లోపే ఉంటుంది. గతంలో 3 గంటలు, అంతకు పైబడి సినిమాలు ఉండేవి. ఇప్పుడు 3 గంటల సినిమా అంటే సాహసం చేస్తున్నట్టే చెప్పొచ్చు. అయితే టైగర్ నాగేశ్వర రావు సినిమా3 గంటల 1 నిమిషం 39 సెకండ్స్ లెంగ్త్ ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తవ్వగా 12 ఛేంజెస్ తో U/A సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం కూడా సర్టిఫికెట్ లో ఉంటుంది.

Also Read : Lokesh Kanagaraj : లియో హిట్ కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తిరుమలకు కాలినడకన..

దీంతో టైగర్ నాగేశ్వర రావు రన్ టైం ఇప్పుడు చర్చగా మారింది. మరీ మూడు గంటల సినిమా అది కూడా యాక్షన్ సినిమా అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? డైరెక్టర్ అంత సేపు ప్రేక్షకులని సినిమాకి కట్టేస్తాడా అనే డౌట్స్ వస్తున్నాయి. చూడాలి మరి మాస్ మహారాజ థియేటర్స్ లో ఏం మ్యాజిక్ చేస్తాడో.