×
Ad

OG Collections : ఫస్ట్ డే అవ్వకముందే రికార్డ్స్.. ప్రీమియర్స్ – అడ్వాన్స్ కలిపి ఇప్పటివరకు OG ఎంత కలెక్ట్ చేసిందంటే..

ప్రీమియర్స్ తోనే చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సెట్ చేసింది OG సినిమా.(OG Collections)

OG Collections

OG Collections : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా OG నేడు రిలీజవుతుంది. ఇప్పటికే నిన్న రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. అమెరికాలో షోలు పడ్డాయి. ప్రీమియర్స్, అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్స్ తోనే OG సినిమా రికార్డులు కొడుతుందని వింటూనే ఉన్నాము. ప్రీమియర్స్ తోనే చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సెట్ చేసింది OG సినిమా.(OG Collections)

బాక్సాఫీస్ సమాచారం మేరకు కేవలం ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే నిన్న రాత్రి వరకు దాదాపు 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది OG సినిమా. అసలు ఇప్పటి వరకు ప్రీమియర్ షోలతో ఈ రేంజ్ ఏ లోకల్ సినిమాకు రాలేదు. ఇందులో అమెరికా నుంచే దాదాపు 24 కోట్ల గ్రాస్ వచ్చింది. నార్త్ అమెరికాలో OG సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే దేవర, పుష్ప 2 రికార్డులు బద్దలుకొట్టింది అక్కడ.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

ఈ లెక్కన ఫస్ట్ డే కలెక్షన్స్ ఈజీగా 150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 హైయెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రజినీకాంత్ కూలి సినిమా 151 కోట్లు. ఈ రికార్డ్ OG సినిమా బద్దలుకొడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అవుతుంది OG సినిమా. మొత్తానికి రిలీజ్ కి ముందే OG సినిమా రికార్డులు సెట్ చేస్తుంది. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.