×
Ad

OG Collections : అదరగొడుతున్న పవర్ స్టార్ OG కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు..?

తాజాగా OG మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. (OG Collections)

OG Collections

OG Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమాతో ఫుల్ హ్యాపీ అయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరుకి అబ్బురపోతున్నారు. సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. ఇక OG సినిమాకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ కూడా ఉంటాయని ప్రకటించాడు దర్శకుడు సుజీత్.(OG Collections)

OG సినిమా మొదటి రోజే 154 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా దూసుకుపోతుంది. తాజాగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. OG సినిమా నాలుగు రోజుల్లో 252 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ సంస్థ.

Also Read : Rashmika Mandanna : బాబోయ్.. బాలీవుడ్ లో రష్మిక మందన్న హాట్ సాంగ్ చూశారా?

ఈ సినిమాకు 171 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన OG సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 340 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. దసరా హాలిడేస్ ఉండటంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్ లో ఉందని సమాచారం.

ఇక అమెరికాలో ఇప్పటికే 5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి దూసుకుపోతుంది.అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల కలెక్షన్స్ అమెరికా నుంచే వచ్చాయి. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా OG నిలిచింది.

Also See : Priyanka Mohan : OG సినిమా.. హీరోయిన్ ప్రియాంక మోహన్ వర్కింగ్ స్టిల్స్..