OG Trailer: ఓజీ ట్రైలర్ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG Trailer). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

OG trailer release postponed

OG Trailer: ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG Trailer). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Ram Charan: ప్లాప్ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన సుకుమార్.. షాక్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్

కారణం ఏంటంటే, సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ మ్యూజికల్ కాన్సర్ట్‌ జరుగనుంది. ఓజీ సినిమాలోని పాటల ప్రధానంగా ఈ వేడుక జరుగనుంది. అయితే, ఈ ఈవెంట్ లోనే మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ ను విడుదల చేయాలనీ భావించారట మేకర్స్. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.