Ram Charan: ప్లాప్ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన సుకుమార్.. షాక్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన (Ram Charan)దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Ram Charan: ప్లాప్ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన సుకుమార్.. షాక్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్

Sukumar chooses Kriti Sanon for Ram Charan's film

Updated On : September 21, 2025 / 8:02 AM IST

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో రామ్ చరణ్ లుక్, ఏఆర్ రహమాన్ మ్యూజిక్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీ రోల్ చేస్తుండటం వంటి యాస్పెక్ట్స్ సినిమాపై బజ్ క్రియేట్(Ram Charan) చేస్తున్నాయి. దాంతో, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మర్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల కానుంది.

Anupama Parameswaran: ఫ్రెడ్ తో గొడవ.. రెండు రోజుల్లో మరణం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అనుపమ

ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ కాంబోలో ఇప్పటికే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ రావడంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అందులోను పుష్ప 2 లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా సినిమా కావడంతో సహజంగానే క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవడం లేదట సుకుమార్. ఈ సినిమా పాన్ ఇండియా రీచ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకోనున్నాడట. గతంలో సుకుమార్ చేసిన వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతి. మహేష్ బాబు హీరోగా వచ్చినా ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

మళ్ళీ ఇంతకాలానికి కృతితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట సుకుమార్. ఆమె అయితేనే తన కథలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నాడట. అయితే, హీరోయిన్ సెలక్షన్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అసహనంగా ఉన్నారట. కారణం ఏంటంటే? తెలుగులో కృతి వన్ నేనొక్కడినే, ఆదిపురుష్, దోచేయ్ సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. కాబట్టి, హీరోయిన్ ను మారిస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సుకుమార్ మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను ఎలా తీసుకుంటాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకానుంది.