Anupama Parameswaran: ఫ్రెడ్ తో గొడవ.. రెండు రోజుల్లో మరణం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అనుపమ
కిష్కిందపురి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

Anupama Parameswaran gets emotional talking about her friend
Anupama Parameswaran: కిష్కిందపురి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలోనే ఇటీవల కిష్కిందపురి సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే, కిష్కిందపురి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన జీవితంలో జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. అందుకే ఫ్యామిలీలో గానీ, ప్రేమలో గానీ, స్నేహంలో గానీ పట్టువిడుపులతో వ్యవహరించాలి. విభేదాలను, కోపాలను మనసులో పెట్టుకొని ఉంటే చివరకు అంతులేని విషాదమే మిగులుతుంది. నాకో క్లోజ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం క్రితం వచ్చిన మనస్పర్థల, విభేదాల కారణంగా అతనితో మాట్లాడటం మానేశాను. తను చాలాసార్లు మెసేజ్ కూడా చేశాడు. కానీ, అనవసరమైన గొడవలు ఎందుకని స్పందించేదాన్ని కాదు.
అలా ఒకసారి మెసేజ్ చేశాడు. నేను పట్టించుకోలేదు. కానీ, రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడనే విషయం తెలిసి షాకయ్యను. ఒక్కోసారి మనల్ని ప్రేమించే వాళ్లతో వచ్చే మనస్పర్థాలు జీవితకాల విషాదాన్ని మిగుల్చుతాయి” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనుపమ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కిష్కిందపురి సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగానటించారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి తెరకెక్కించాడు.